భారతదేశం, జనవరి 30 -- ఏపీ గ్రూప్ 1 తుది ఫలితాలు వచ్చేశాయి. ఈ రిక్రూట్ మెంట్ లో భాగంగా 87 పోస్టులను భర్తీ చేశారు. ఇందుకు సంబంధించిన జాబితాను ఏపీపీఎస్సీ శుక్రవారం విడుదల చేసింది.

వివిధ కేటగిరీల్లో పోస్టులకు ప్రాథమికంగా ఎంపిక చేసిన వారి హాల్‌టికెట్‌ నంబర్లతో కూడిన జాబితాను వెబ్ సైట్ లో పొందుపరిచింది. ఈ జాబితాను ఏపీపీఎస్సీ అధికారిక వెబ్ సైట్ లో చూడొచ్చు.

ఈ పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ 2023 డిసెంబరు 8న ప్రకటన విడుదల చేసింది. 2024 మార్చిలో ప్రిలిమ్స్ పరీక్షలను నిర్వహించగా. 2025 మే నెలలో మెయిన్స్ పరీక్షలను పూర్తి చేశారు. జూన్ లో నుంచి జూలై వరకు ఇంటర్వ్యూలు నిర్వహించగా. ఇవాళ తుది ఫలితాలను ప్రకటించారు.

Published by HT Digital Content Services with permission from HT Telugu....