భారతదేశం, మే 12 -- సనాతన ధర్మంలో ఏకాదశి తిథిని అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. ప్రతి నెలా వచ్చే రెండు ఏకాదశులు శ్రీమహావిష్ణువుకు ప్రీతిపాత్రమైనవి. అయితే వైశాఖ మాసం కృష్ణ పక్షంలో వచ్చే ఏకాదశిని 'అపర ఏకాదశి' అని పిలుస్తారు. ఈ రోజున భక్తిశ్రద్ధలతో ఉపవాసం ఉండి స్వామివారిని ఆరాధిస్తే అపారమైన పుణ్యం లభిస్తుందని, అందుకే దీనికి 'అపర' అనే పేరు వచ్చిందని పండితులు చెబుతుంటారు. తెలుగు రాష్ట్రాల్లో దీనిని అచల ఏకాదశి, భద్రకాళీ ఏకాదశి అని కూడా పిలుస్తుంటారు.

ప్రతి ఏటా తిథుల హెచ్చుతగ్గుల వల్ల ఏకాదశి ఏ రోజు జరుపుకోవాలనే సందిగ్ధత భక్తులలో నెలకొంటుంది. 2026 సంవత్సరానికి సంబంధించి పంచాంగ కర్తలు అపర ఏకాదశి తేదీని ఖరారు చేశారు.

ఏకాదశి ప్రారంభం: మే 12, 2026 మధ్యాహ్నం 02:52 నిమిషాలకు తిథి మొదలవుతుంది.

ఏకాదశి ముగింపు: మే 13, 2026 మధ్యాహ్నం 01:29 నిమిషాలకు తిథ...