భారతదేశం, నవంబర్ 20 -- ఐదేళ్ల క్రితం ఓపెన్ఏఐ సంస్థ నుంచి బయటకు వచ్చిన కొద్దిమంది పరిశోధకులు కలిసి సొంతంగా ఒక స్టార్టప్ మొదలుపెట్టారు. గురువారం అమెరికా నాస్‌డాక్ స్టాక్ ఎక్స్​ఛేంజ్​లో ఓపెనింగ్​ బెల్ మోగించిన ఆ సంస్థ విలువ ఏకంగా ఇటలీ దేశ ఆర్థిక వ్యవస్థ పరిమాణానికి సమానంగా ఎదిగింది! ఆ సంస్థే ప్రముఖ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) దిగ్గజం 'ఆంత్రోపిక్'.

నాస్‌డాక్‌లో 'ANT' టిక్కర్ పేరుతో ఆంత్రోపిక్ షేర్ల ట్రేడింగ్ మొదలైంది. బుధవారం సంస్థ నిర్ణయించిన ఐపీఓ ధర 83 డాలర్లతో పోలిస్తే, గురువారం ఏకంగా 30 శాతానికి పైగా లాభంతో 111.50 డాలర్ల వద్ద ట్రేడింగ్ ప్రారంభించింది. అంతకుముందు సంస్థ ప్రకటించిన 70 నుంచి 78 డాలర్ల ప్రైస్ బ్యాండ్ కంటే ఇది చాలా ఎక్కువ. ఈ పబ్లిక్ ఇష్యూ ద్వారా ఆంత్రోపిక్ 98 కోట్ల షేర్లను విక్రయించింది; వీటిలో అత్యధికం కంపెనీ కొత్తగా జారీ ...