భారతదేశం, జూలై 19 -- Anshu: కింగ్ అక్కినేని నాగార్జున కెరీర్‌లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ క్లాసిక్ సినిమా 'మన్మథుడు'. ఇది ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుంటుంది. అందులో మహేశ్వరి పాత్రలో ఎంతో అమాయకంగా, అందంగా నటించి తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న నటి అన్షు. ఆమె సోషల్ మీడియాలో మళ్లీ వార్తల్లో నిలిచింది.

చాలా కాలంగా వెండితెరకు దూరమై, రీసెంట్ గా మజాకా మూవీతో రీ ఎంట్రీ ఇచ్చిన అన్షు వీడియో ఒకటి వైరల్ గా మారింది. ఈ సీనియర్ బ్యూటీ, తాజాగా తన జపాన్ పర్యటనకు సంబంధించిన ఒక క్రేజీ వీడియోను పంచుకుంది. అక్కడ ఆమె ఒక భారీకాయుడైన అసలైన సుమో రెజ్లర్‌తో రింగ్‌లో ఆమె తలపడటం ఇప్పుడు నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. బీస్ట్ తో బ్యూటీ ఫైటింగ్ అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

జపాన్ సాంప్రదాయ క్రీడ, అక్కడి సంస్కృతికి ప్రతీకగా ని...