భారతదేశం, జూలై 27 -- Anna Konidala: జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) భార్య అన్నా కొణిదెల చేసిన లేటెస్ట్ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ ఇప్పుడు ఇంటర్నెట్‌లో విపరీతంగా వైరల్ అవుతోంది. తన పేరు విషయంలో మీడియా, నెటిజన్లు పదే పదే చేస్తున్న ఒక పెద్ద పొరపాటుపై ఆమె స్పందిస్తూ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

తనను అందరూ ఇప్పటికీ 'అన్నా లేజ్నెవా' అని పిలవడంపై ఆమె స్పష్టత ఇచ్చారు. తన పుట్టినరోజు త్వరలోనే రాబోతున్న సందర్భంగా ఈ విషయాన్ని అధికారికంగా చెప్పడానికి ఇదే సరైన సమయమని భావిస్తున్నట్లు పేర్కొన్నారు.

సోషల్ మీడియాలో అన్నా కొణిదెల స్పందిస్తూ.. "ఒక వ్యక్తికి పేరు అనేది చాలా పర్సనల్ విషయం. నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ప్రారంభించినప్పటి నుంచి ఈ విషయం చెప్పాలనుకుంటున్నా. చాలాసార్లు రాసి డిలీట్ చేశా. ఇప్పుడు నా బర్త్‌డే రాబోతున్న ...