భారతదేశం, మే 12 -- చాలామంది ఆంజనేయ దండకం చదువుతూ ఉంటారు. నిజానికి ఆంజనేయ దండకం చదవడం వలన అనేక లాభాలు కలుగుతాయి. "శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం" అంటూ మొదలయ్యే ఆంజనేయ దండకం భక్తులకు నిజానికి ఒక రక్షణ కవచం లాంటిదని చెప్పొచ్చు. ఈ దండకాన్ని ప్రతిరోజూ చదువుకుంటే అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. మరి ఈ ఆంజనేయ దండకాన్ని చదివితే ఏమవుతుంది? ప్రయోజనాలు, ఆధ్యాత్మిక రహస్యాల గురించి ఇప్పుడే తెలుసుకుందాం.

మన హిందూ ధర్మంలో హనుమంతుడికి సంబంధించి చాలా స్తోత్రాలు ఉన్నాయి. కానీ ఎక్కువమంది ఆంజనేయ దండకాన్ని చదువుతూ ఉంటారు. దీనికి ఎక్కువ ప్రాచుర్యం ఉంది. ఆపదలో ఉన్నప్పుడు, భయం వేసినప్పుడు చాలామంది "శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం" అని ఆంజనేయ దండకాన్ని చదువుతూ ఉంటారు.

దండకం అంటే ఒక చందస్సులో సాగే స్తోత్రం. ఆంజనేయ దండకంలో హనుమాన్ వీరత్వాన్ని, శౌర్యాన్ని, భక్తిని వర్ణించ...