భారతదేశం, అక్టోబర్ 19 -- Anirudh Kavya Wedding: సౌత్ ఇండియన్ మ్యూజిక్ సెన్సేషన్, రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) ఫ్రాంచైజీ కో-ఓనర్ కావ్య మారన్ త్వరలోనే వివాహ బంధంతో ఒకటి కాబోతున్నారు. ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో, సినీ-వ్యాపార వర్గాల్లో సంచలనంగా మారింది.

తమిళంతో పాటు తెలుగు, హిందీ చిత్ర పరిశ్రమల్లో వరుస చార్ట్‌బస్టర్ మ్యూజిక్‌తో రికార్డులు సృష్టిస్తున్న అనిరుధ్, సన్ నెట్‌వర్క్ అధినేత కళానిధి మారన్ కుమార్తె కావ్య మారన్ కొంతకాలంగా ప్రేమలో ఉన్నారంటూ ప్రచారం జరుగుతోంది. తాజాగా వీరి రాయల్ డెస్టినేషన్ వెడ్డింగ్‌కు సంబంధించిన క్రేజీ అప్‌డేట్ బయటకు వచ్చి విపరీతంగా ట్రెండ్ అవుతోంది.

తాజాగా వస్తున్న రిపోర్టుల ప్రకారం.. అనిరుధ్ - కావ్య మారన్‌ల పెళ్లి వేడుకను ఐరోపా ఖండంలోని అత్యంత మనోహరమైన దేశమైన గ్రీస్‌లో (Greece) ప్ల...