భారతదేశం, అక్టోబర్ 31 -- Anil Ravipudi Saregamapa: జీ తెలుగులో ప్రతి వారం ప్రసారమయ్యే 'సరిగమప' సింగింగ్ రియాలిటీ షోకి ఎంతటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సుడిగాలి సుధీర్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఈ షోలో, ఎంతో మంది అద్భుతమైన గాయనీ గాయకులు తమ వాయిస్ తో మ్యాజిక్ చేస్తున్నారు. అయితే ఈ సింగర్స్ కు అనిల్ రావిపూడి గోల్డెన్ ఆఫర్ ఇవ్వనున్నారు.

విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్ కాంబినేషన్ లో బ్లాక్ బస్టర్ దర్శకుడు అనిల్ రావిపూడి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న లేటెస్ట్ మల్టీస్టారర్ మూవీ 'జనవరి 12 విడుదల'. ఈ సినిమా ద్వారా ముగ్గురు టాలెంటెడ్ సింగర్స్ ప్లే బ్యాక్ సింగర్స్ గా వెండితెరకు పరిచయం కాబోతున్నారు. సరిగమప షోలో పాడుతున్న సింగర్స్ కు అనిల్ రావిపూడి ఛాన్స్ ఇచ్చేందుకు రెడీ అయ్యారు.

కొత్త గాయకులను ఎంకరేజ్ చేయడంలో జీ తెలుగు ఎప...