భారతదేశం, జూలై 29 -- Anantha Sriram: ఇటీవలి కాలంలో ఒక సినిమా థియేటర్లలోకి వచ్చిన వెంటనే డిజిటల్, యూట్యూబ్ వేదికగా వస్తున్న ఇన్స్టంట్ రివ్యూలపై టాలీవుడ్ చిత్ర పరిశ్రమ వర్గాల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. తాజాగా కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరి ప్రియ జంటగా నటించిన 'చెన్నై లవ్ స్టోరీ' చిత్రం బాక్సాఫీస్ ను షేక్ చేస్తోంది. ఈ మూవీ సక్సెస్ మీట్ లో ఫిల్మ్ క్రిటిక్స్, రివ్యూయర్ల వైఖరిపై అనంత శ్రీరామ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తాడు.

'చెన్నై లవ్ స్టోరీ' ఈవెంట్‌లో అనంత శ్రీరామ్ మాట్లాడుతూ రివ్యూయర్ల ద్వంద్వ వైఖరిని ఎండగట్టాడు. "చెన్నై లవ్ స్టోరీ మూవీ సెకండాఫ్ డల్ గా ఉందని అంటున్నారు. అదే స్క్రీన్ ప్లే, రైటింగ్ మలయాళ సినిమాలో ఉంటే 'మ్యాజిక్' అంటారు. తమిళ సినిమాలో ఉంటే 'టెర్రిఫిక్' అంటారు. కన్నడలో ఉంటే 'క్లాసిక్', హిందీలో ఉంటే 'హోలిస్టిక్' అని పొగుడుతారు'' అన...