భారతదేశం, సెప్టెంబర్ 15 -- Amitabh Bachchan Retirement: బాలీవుడ్ షెహన్‌షా అమితాబ్ బచ్చన్ తన రిటైర్మెంట్‌పై వస్తున్న వార్తలకు ఒక్క దెబ్బతో చెక్ పెట్టారు. సోషల్ మీడియాలో, కొన్ని మీడియా కథనాల్లో జరుగుతున్న ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తూ తన అధికారిక బ్లాగ్ ద్వారా ఫుల్ క్లారిటీ ఇచ్చారు. సినిమా ఇండస్ట్రీకి గానీ, బుల్లితెర పాపులర్ గేమ్‌షో 'కౌన్ బనేగా కరోడ్‌పతి' (KBC)కి గానీ తాను ఎలాంటి గుడ్‌బై చెప్పడం లేదని స్పష్టం చేశారు.

కొద్దిరోజుల క్రితం అమితాబ్ బచ్చన్ తన బ్లాగ్‌లో "Time to retire" అని రాసుకొచ్చారు. దాంతో ఆయన నటన నుంచి, కేబీసీ షో నుంచి తప్పుకుంటున్నారంటూ వార్తలు ఊపందుకున్నాయి. అయితే ఈ పుకార్లను బిగ్ బి తీవ్రంగా తప్పుపట్టారు.

ఆంగ్లంలో 'రిటైర్' అంటే కేవలం ఉద్యోగం నుంచి తప్పుకోవడం మాత్రమే కాదని, రాత్రి వేళ పడుకోవడానికి వెళ్లడాన్ని కూడా 'రిటైర్...