భారతదేశం, నవంబర్ 2 -- Amitabh Bachchan: ముంబైలోని తన బంగ్లా 'జల్సా' బయట ప్రతి ఆదివారం అభిమానులను పలకరించడం అమితాబ్ బచ్చన్‌కు దశాబ్దాలుగా ఉన్న అలవాటు. కానీ ఈ వారం అక్కడి దృశ్యం పూర్తిగా మారిపోయింది. ఆయన నేరుగా కాకుండా ఒక ట్రాన్స్ పరెంట్ గ్లాస్ బాక్స్ లోపలి నుంచి అభిమానులకు అభివాదం చేశారు.

ఈ సండే (నవంబర్ 1) తన ఫ్యాన్స్ ను అమితాబ్ బచ్చన్ ఎప్పటిలాగే పలకరించారు. కానీ ఈ సారి ఆయన బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్ బాక్స్ లోపల ఉన్నారు. ఈ వీడియోలు ఇప్పుడు ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్నాయి. తండ్రికి రక్షణగా అభిషేక్ బచ్చన్ కూడా ఆయన వెంటే ఉండి, జనాలపై ఓ కన్నేసి ఉంచారు. చుట్టుపక్కల భారీ సంఖ్యలో భద్రతా సిబ్బంది మోహరించారు.

అమితాబ్‌కు అకస్మాత్తుగా ఇంతటి కట్టుదిట్టమైన భద్రత కల్పించడానికి ప్రధాన కారణం ఇటీవల వచ్చిన ఒక బాంబు బెదిరింపు. ముంబైలోని బాంద్రా-కుర్లా కాంప్లెక్...