భారతదేశం, ఆగస్టు 13 -- Ameerlog Trailer: హైదరాబాద్ బస్తీ లోకల్ ఫ్లేవర్‌తో మరో మూవీ ప్రేక్షకుల ముందుకు వస్తోంది. బస్తీ పోరగాళ్లు చేసే హంగామాతో థియేటర్లలో మార్మోగనున్నాయి. దగ్గుబాటి రానా సమర్పణలో అవ్వల్ నంబర్ ప్రొడక్షన్స్ నిర్మించిన 'అమీర్ లోగ్' మూవీ థియేట్రికల్ ట్రైలర్ గ్రాండ్‌గా రిలీజ్ అయి యూత్‌ను విశేషంగా ఆకట్టుకుంటోంది.

అవ్వల్ నంబర్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై మాధవి రెడ్డి సోమ నిర్మించిన ఈ చిత్రానికి రమణ రెడ్డి సోమ దర్శకత్వం వహించారు. మనోహర్ రెడ్డి మంచూరి కో-ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తుండగా.. టాలీవుడ్ స్టార్ హీరో రానా దగ్గుబాటి 'స్పిరిట్ మీడియా' పతాకంపై ఈ ప్రాజెక్ట్‌ను సమర్పిస్తున్నారు.

తాజాగా విడుదలైన ట్రైలర్ హైదరాబాద్‌లోని ఒక లోకల్ బస్తీలో ఉండే నలుగురు యంగ్ కుర్రాళ్ల చుట్టూ తిరుగుతుంది. రోజూ గల్లీ క్రికెట్, ఫ్రెండ్‌షిప్, వీధి దాబాల దగ్గర ...