భారతదేశం, జనవరి 23 -- ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ తన ఉద్యోగులకు మరోసారి చేదు వార్త చెప్పబోతోంది. సంస్థలోని అంతర్గత బ్యూరోక్రసీని తగ్గించి, పనితీరును వేగవంతం చేసే క్రమంలో.. వచ్చే వారం నుంచే ఉద్యోగ కోతలను ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. గత అక్టోబర్‌లో చేపట్టిన ప్రక్షాళన కొనసాగింపుగానే కంపెనీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు అంతర్జాతీయ వార్తా సంస్థలు చెబుతున్నాయి.

2025 అక్టోబరు నెలలో అమెజాన్ సుమారు 14,000 కార్పొరేట్ ఉద్యోగాలను తొలగించింది. అప్పట్లో ప్రకటించిన 30,000 ఉద్యోగాల కోత లక్ష్యంలో ఇది సగం మాత్రమే. మిగిలిన కోతలను వచ్చే మంగళవారం నుంచే అమలు చేయాలని కంపెనీ భావిస్తున్నట్లు సమాచారం. ఈ విడతలో కూడా సుమారు 14,000 మందికి పైగా ఉద్యోగులు ప్రభావితమయ్యే అవకాశం ఉంది.

తాజా సమాచారం ప్రకారం, ఈ లేఆఫ్స్ ప్రభావం అమెజాన్‌లోని కీలక విభాగాలపై పడనుంది:

అమెజా...