భారతదేశం, జూలై 5 -- బాలీవుడ్ మోస్ట్ ఎవైటెడ్ యాక్షన్ డ్రామా 'ఆల్ఫా' జూలై 3న థియేటర్లలోకి వచ్చి ప్రేక్షకులను అలరిస్తోంది. ఈ సినిమాలో అలియా భట్, శర్వరీ వాఘ్ ఇద్దరూ లీడ్ రోల్స్​లో కనిపించి బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తున్నారు. సినిమా చూసిన ప్రతి ఒక్కరినీ అమితంగా ఆకట్టుకుంటున్న ప్రధాన అంశం.. వీరిద్దరి ఫిట్​నెస్, చురుకుదనం. స్క్రీన్‌పై అత్యంత క్లిష్టమైన యాక్షన్ సీక్వెన్స్‌లను సైతం వీరు ఎంతో అలవోకగా చేసినట్లు కనిపిస్తోంది. ఈ రేంజ్ బాడీ ట్రాన్స్‌ఫార్మేషన్ వెనుక దాదాపు ఏడాదిన్నర కాలానికి పైగా సాగిన కఠోర శ్రమ దాగి ఉందని వారి పర్సనల్ ఫిట్‌నెస్ ట్రైనర్స్ కరణ్ సాహ్ని, రాబిన్ బెల్ వెల్లడించారు.

ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఒక ప్రత్యేక వీడియోలో ట్రైనర్స్ కరణ్, రాబిన్.. ఆల్ఫా స్టార్స్ అలియా, శర్వరీల వర్కౌట్ ప్లాన్‌ను ఎలా డిజైన్ చేశారో వివరించారు. రోజూ 10 ...