భారతదేశం, మార్చి 13 -- రీసెంట్ గా అల్లు శిరీష్ ఓ ఇంటివాడయ్యాడు. మార్చి 6న హైదరాబాద్ లో జరిగిన పెళ్లిలో తన ప్రియురాలు నయనిక రెడ్డి మెడలో మూడు ముళ్లు వేశాడు. పెళ్లి తర్వాత ఈ జంట తమ వర్క్ లైఫ్ లో బిజీ అయిపోయింది. ఈ నేపథ్యంలో హిందూస్థాన్ టైమ్స్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన లవ్ స్టోరీ, హనీమూన్ ప్లాన్స్ గురించి శిరీష్ ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశాడు.

నయనికను ఓ పార్టీలో అల్లు శిరీష్ కలిశాడు. హీరో నితిన్ భార్య శాలినికి నయనిక బెస్ట్ ఫ్రెండ్. 2023లో పెళ్లి చేసుకున్న వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి కోసం నితిన్, శాలిని ఓ పార్టీ అరెంజ్ చేశారు. ఈ పార్టీలోనే నయనికను ఫస్ట్ టైమ్ కలిసినట్లు శిరీష్ తెలిపాడు.

"మేము డేటింగ్ ప్రారంభించినప్పటి నుంచి పెళ్లి గురించే మాట్లాడుకున్నాం. వెడ్డింగ్ చేసుకుంటామనే అనుకున్నాం. అలాగే మాకు పుట్టబోయే పిల్లలు ఇంట్లో తెలుగులో మాట్లాడా...