భారతదేశం, ఏప్రిల్ 14 -- Allu Arjun Raaka: టాలీవుడ్ నుంచి గ్లోబల్ బాక్సాఫీస్ వరకు తన సత్తా చాటుతున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. ప్రస్తుతం వరుస భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. 'పుష్ప 2: ది రూల్' తర్వాత బన్నీ రేంజ్ అమాంతం పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో అగ్ర దర్శకుడు అట్లీ కుమార్‌తో అతడు చేయబోయే సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

తాజాగా ఈ సినిమాకు 'రాకా' (RAAKA) అనే టైటిల్‌ను ఖరారు చేస్తూ చిత్ర యూనిట్ ఫస్ట్ లుక్ విడుదల చేసింది. అయితే ఈ సినిమాకు సంబంధించి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఒక ఆసక్తికరమైన వార్త ఇప్పుడు ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పిస్తోంది.

ఈ రాకా సినిమాలో బన్నీ సరసన ఏకంగా నలుగురు గ్లామర్ క్వీన్స్ నటించబోతున్నారట. అట్లీ సినిమాలంటేనే భారీ తారాగణం, కమర్షియల్ హంగులు పుష్కలంగా ఉంటాయి. 'జవాన్' చిత్రంతో బాలీవుడ్‌ను షేక్ చేసిన అట్లీ, ఇప...