భారతదేశం, జూన్ 21 -- Allu Arjun Father's Day Post: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఆదివారం (జూన్ 21) సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్టు షేర్ చేశాడు. ఫాదర్స్ డే సందర్భంగా తన తండ్రి, గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్‌పై ఉన్న అమితమైన ప్రేమాభిమానాలను అల్లు అర్జున్ చాటుకున్నాడు.

సోషల్ మీడియాలో అల్లు అర్జున్ షేర్ చేసిన ఒక ఎమోషనల్ నోట్ ప్రస్తుతం అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటూ నెట్టింట టాప్ ట్రెండింగ్‌లోకి వచ్చింది. ఎంతటి బిజీ షెడ్యూల్స్ ఉన్నప్పటికీ కుటుంబానికి, ముఖ్యంగా తన తండ్రికి ప్రాధాన్యత ఇవ్వడంలో బన్నీ ఎప్పుడూ ముందే ఉంటాడని ఈ పోస్ట్ మరోసారి నిరూపించింది.

అల్లు అర్జున్ తన పోస్ట్‌లో ఏం రాసుకొచ్చాంటే.. "నాకు మా నాన్నే దేవుడు. నేను చూడగలిగే, వినగలిగే, మాట్లాడగలిగే, తాకగలిగే ఏకైక దేవుడు ఆయనే. నా జీవితంలో నాకు అన్నీ ఇచ్చింది ఆయనే. హ్యాపీ ఫాదర్స్ డే టు ...