భారతదేశం, జూలై 28 -- Allu Arjun Fans Association: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాను నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ పాన్-వరల్డ్ ప్రాజెక్ట్ 'రాకా' (Raaka) షూటింగ్‌కి చిన్న బ్రేక్ ఇచ్చి ఏకంగా 2000 మంది అభిమానులను కలిశారు. హైదరాబాద్ వేదికగా జరిగిన అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ (AAFA) స్పెషల్ ఈవెంట్‌లో అభిమానులతో ముచ్చటించిన బన్నీ.. ఆ తర్వాత వారితో రాకా స్టైల్లో దిగిన ఒక క్రేజీ సెల్ఫీని ఎక్స్ ప్లాట్‌ఫామ్‌లో పోస్ట్ చేస్తూ చాలా ఎమోషనల్ అయ్యారు. షూటింగ్ బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ ప్రత్యేకంగా సమయం కేటాయించి అభిమానులను కలవడంతో మెగా అండ్ బన్నీ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.

తన అభిమానులను ఉద్దేశించి అల్లు అర్జున్ సోషల్ మీడియాలో రాస్తూ.. "నా డియర్ ఫ్యాన్స్, ఈ ఈవెంట్ కోసం మీరంతా వేర్వేరు ప్రాంతాల నుంచి రావడం నా హృదయాన్ని తాకింది. మీరు నాపై చూపిస్తున్న ప్...