భారతదేశం, జూలై 15 -- Allu Arjun: ఇండియన్ సినీ ఇండస్ట్రీలో ఒకప్పుడు ప్రాంతీయ మార్కెట్లకే పరిమితమైన స్టార్డమ్, ఇప్పుడు సరిహద్దులు దాటి విస్తరిస్తోంది. ఈ ట్రెండ్‌ను పక్కాగా ఒడిసిపట్టుకుని, సౌత్ టు నార్త్ అన్ని మేజర్ ఇండస్ట్రీలను కవర్ చేస్తూ హిస్టారికల్ లైనప్‌ను సెట్ చేసుకుంటున్నాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ప్రస్తుతం అల్లు అర్జున్ చేయబోయే సినిమాల లైనప్ చూస్తే మైండ్ బ్లాక్ అవడం ఖాయం.

అల్లు అర్జున్, మాస్ పల్స్ తెలిసిన డైరెక్టర్ అట్లీ కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం 'రాకా'. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ భారీ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో బాలీవుడ్ టాప్ నటి దీపికా పదుకొణె హీరోయిన్ గా నటిస్తోంది.

'పుష్ప' చిత్రంతో నార్త్ బెల్ట్‌లో అల్లు అర్జున్‌కు వచ్చిన క్రేజ్‌ను స్టెబిలైజ్ చేయడానికి 'రాకా' మూవీ అనేది పక్కా ప్లాన్. బ...