భారతదేశం, జూలై 28 -- Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) సోషల్ మీడియా హేటర్స్, ఆన్‌లైన్ ట్రోలర్స్‌కు గట్టి కౌంటర్ ఇచ్చారు. హైదరాబాద్ యూసుఫ్‌గూడ శౌర్య భవన్‌లో జరిగిన అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ (AAFA) ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్న బన్నీ.. "ఎవరైనా నచ్చకపోతే వారిని ద్వేషిస్తూ టైమ్ వేస్ట్ చేయకండి.. వదిలేయండి" అంటూ అభిమానులకు పవర్ ఫుల్ సందేశం ఇచ్చారు. బన్నీ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుండటంతో పాటు సినీ వర్గాల్లోనూ తీవ్రంగా చర్చనీయాంశమయ్యాయి.

ఈ సందర్భంగా సోషల్ మీడియాలో నిత్యం జరిగే ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్ కల్చర్‌పై అల్లు అర్జున్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మన జీవితాన్ని రోజువారీ 100 శాతం బ్యాటరీతో పోల్చిన అల్లు అర్జున్.. ఆ ఎనర్జీని ఎలా వాడుకోవాలనేది పూర్తిగా మన చేతుల్లోనే ఉంటుందని స్పష్టం ...