భారతదేశం, జూలై 22 -- Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ త్వరలో రాబోతున్న తన మోస్ట్ అవేటెడ్ పాన్ ఇండియా మూవీ 'రాకా' (Raaka) బిజీ షూటింగ్ షెడ్యూల్ నుంచి చిన్న బ్రేక్ తీసుకున్నారు. తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్‌లో వస్తున్న ఈ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ చిత్రీకరణకు గ్యాప్ ఇచ్చి.. తన ఫ్యామిలీతో కలిసి ఆస్ట్రియా మంచు కొండల్లో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నారు.

అల్లు అర్జున్, ఆయన భార్య స్నేహా రెడ్డి, పిల్లలు అయాన్, అర్హాలతో కలిసి ఆస్ట్రియాలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన 'సీగ్రూబ్ టెర్రేస్' (Seegrube terrace) ను సందర్శించారు. ఇన్స్‌బ్రక్ సమీపంలోని నార్డ్‌కెట్ పర్వత శ్రేణిలో సముద్ర మట్టానికి సుమారు 1,905 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ లొకేషన్‌లో అల్లు ఫ్యామిలీ చిల్ అవుతున్న పిక్చర్స్ ఇప్పుడు నెట్‌లో హల్‌చల్ చేస్తున్నాయి. స్నేహా రెడ్డి తన ఇన్‌స్టాగ్రామ్ స...