భారతదేశం, మార్చి 15 -- ఆర్ఆర్ఆర్ సినిమాలో సీత పాత్రతో తెలుగు వాళ్లను అలరించిన అలియా భట్ బర్త్ డే ఈ రోజు (మార్చి 15). బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా దూసుకెళ్తోన్న ఈ భామ తన సినీ కెరీర్ లో డిఫరెంట్ రోల్స్ చేస్తూ సాగిపోతోంది. నేషనల్ అవార్డు అందుకున్న అలియా భట్ కెరీర్ లో టాప్-5 సినిమాలు, వాటి ఓటీటీ లిస్ట్ పై ఓ లుక్కేయండి.

అలియా భట్ సినిమా కెరీర్ చెప్పుకోవాలంటే ముందు 'గంగుబాయి కతియావాడి' గురించి చెప్పుకోవాల్సిందే. సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో గంగుబాయిగా అలియా భట్ యాక్టింగ్ వేరే లెవల్. బ్రోతల్ హౌస్ లోకి వచ్చి పడ్డ తర్వాత పరిస్థితులను తనకు అనుకూలంగా మార్చుకుని గంగుబాయి తిరుగులేని శక్తిగా ఎలా ఎదిగిందనేది ఈ మూవీలో చూపించారు.

2022లో రిలీజైన గుంగూబాయి కతియావాడి సినిమాలో యాక్టింగ్ కు గాను అలియా భట్ నేషనల్ అవార్డు అందుకుంది. ఈ మూవ...