భారతదేశం, ఏప్రిల్ 21 -- Alia Bhatt: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ పేరు మరోసారి హాట్ టాపిక్ గా మారింది. ఓ పాకిస్థానీ దుస్తుల బ్రాండ్ ను ఆమె ప్రమోట్ చేస్తుందనే కామెంట్లు వస్తున్నాయి. అయితే దీని వెనుక పెద్ద కథనే ఉంది. నిజంగానే పాకిస్థానీ బ్రాండ్ కు అలియా భట్ బ్రాండ్ అంబాసిడర్ గా ఉందా? అనే విషయాన్ని ఇక్కడ చూసేయండి.

పాకిస్థాన్‌కు చెందిన 'వజేషా అఫీషియల్' (Wajayesha Official) అనే క్లాతింగ్ బ్రాండ్ ఈ వారం సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపింది. అలియా భట్ తమ లేటెస్ట్ ఎత్నిక్ వేర్ కలెక్షన్ ధరించి పోజులిచ్చినట్లుగా కొన్ని ఫోటోలను ఈ బ్రాండ్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఈ ఫొటోలు తెగ వైరల్ గా మారాయి. పాకిస్థానీ బ్రాండ్ ను అలియా భట్ ప్రమోట్ చేయడం ఏంటీ? అనే ప్రశ్నలు వచ్చాయి.

ఈ బ్రాండ్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో అలియా భట్ వివిధ రంగుల సిల్క్ దుస్...