భారతదేశం, సెప్టెంబర్ 26 -- AK 47 Song: విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబోలో రాబోతున్న మోస్ట్ అవైటెడ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ 'ఆదర్శ కుటుంబం హౌస్ నంబర్ 47' (AK47). ఈ మూవీ విడుదల తేది అక్టోబర్ 2 నుంచి అక్టోబర్ 9కి వాయిదా పడిన సంగతి తెలిసిందే. సినిమా విడుదలలో మార్పు కారణంగా ఆలస్యమైన ఫస్ట్ సింగిల్ 'నారాయణమ్మ' సాంగ్‌ను రిలీజ్ చేసేందుకు మేకర్స్ మరో ముహూర్తం పెట్టారు.

త్రివిక్రమ్ శ్రీనివాస్ మేకింగ్, విక్టరీ వెంకటేష్ టైమింగ్ కలసి వస్తున్న 'ఆదర్శ కుటుంబం' సినిమాపై టాలీవుడ్‌లో విపరీతమైన హైప్ ఉంది. తొలుత అక్టోబర్ 2న దసరా బరిలో విడుదల చేయాలని భావించినప్పటికీ, పోస్ట్ ప్రొడక్షన్ పనులలో నాణ్యత కోసం అక్టోబర్ 9కి వాయిదా వేస్తున్నట్లు నిర్మాతలు చినబాబు, ఎస్. రాధాకృష్ణ ప్రకటించారు.

ఆదర్శ కుటుంబం మూవీ రిలీజ్ డేట్ మార్పు కారణంగా నారాయణమ్మ సాం...