భారతదేశం, జూలై 30 -- భారత క్రికెట్ చరిత్రలో తనదైన ముద్ర వేసిన మిడిలార్డర్ భరోసా, క్లాసిక్ బ్యాటర్ అజింక్య రహానే క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. అన్ని రకాల ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్లు 38ఏళ్ల రహానే అధికారికంగా ప్రకటించాడు.

ఫలితంగా 2026 ఇండియన్ ప్రిమియర్ లీగ్ (ఐపీఎల్) టోర్నీలో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుకు నాయకత్వం వహిస్తూ 14 మ్యాచ్‌లలో 335 పరుగులు చేసిన రహానేకు అదే చివరి మ్యాచ్‌గా నిలిచింది. ఇటీవల మళ్లీ భారత జట్టులోకి రీ-ఎంట్రీ ఇవ్వాలనే నిశ్చయంతో ఉన్నప్పటికీ, 17 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణానికి ముగింపు పలకడమే సరైన నిర్ణయం అని రహానే భావించాడు.

Published by HT Digital Content Services with permission from HT Telugu....