భారతదేశం, ఆగస్టు 18 -- Ajay Arasada: జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రశంసలు అందుకోవడం అంటే ఏ మ్యూజిక్ డైరెక్టర్‌కైనా మైండ్ బ్లోయింగ్ మూమెంట్. రీసెంట్‌గా టాలీవుడ్‌లో వరుస హిట్స్‌తో దూసుకుపోతున్న సక్సెస్ ఫుల్ మ్యూజిక్ కంపోజర్ అజయ్ అరసాడను పవన్ పర్సనల్‌గా పిలిపించుకుని ఏకంగా అరగంట సేపు మాట్లాడటం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.

'ఆయ్', 'సేవ్ ది టైగర్స్', 'వికటకవి' వంటి డిఫరెంట్ ప్రాజెక్ట్స్‌తో మ్యూజిక్ డైరెక్టర్‌గా తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న అజయ్ అరసాడ తన పదేళ్ల సినీ జర్నీకి సంబంధించిన అనేక ఆసక్తికర విషయాలను ఓపెన్‌గా పంచుకున్నారు.

జనసేన రాజకీయ ప్రచారాలతోపాటు ప్రధాని నరేంద్ర మోదీని పవన్ కళ్యాణ్ కలిసినప్పుడు అజయ్ అరసాడ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ పవన్ దృష్టిని విపరీతంగా ఆకట్టుకుంది. ఆ వర్క్ చూసిన వెంటనే ప...