భారతదేశం, ఏప్రిల్ 21 -- Aishwarya Rai Aaradhya Airport Video: ఐశ్వర్య రాయ్ బచ్చన్ కేవలం స్టార్ హీరోయిన్ మాత్రమే కాదు.. ఒక బాధ్యతాయుతమైన తల్లి అని మరోసారి నిరూపించుకున్నారు. స్కూల్ ట్రిప్ నుండి తిరిగి వస్తున్న కూతురు ఆరాధ్యకు ఎయిర్‌పోర్టులో సర్‌ప్రైజ్ ఇచ్చి ఆ క్షణాలను కెమెరాలో బంధించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ప్రపంచ సుందరి ఐశ్వర్య రాయ్ బచ్చన్, ఆమె కుమార్తె ఆరాధ్య బచ్చన్ మధ్య ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎక్కడికి వెళ్లినా నీడలా వెంట ఉండే ఈ తల్లీకూతుళ్ల బాండింగ్ నెటిజన్ల మనసు గెలుచుకుంటూనే ఉంటుంది.

తాజాగా ఆరాధ్య తన స్కూల్ ట్రిప్ ముగించుకుని తిరిగి వస్తుండగా.. ఐశ్వర్య సాధారణ తల్లిలాగే ఎయిర్‌పోర్టుకు చేరుకుని ఎదురు చూశారు. అక్కడ ఉన్న ఇతర తల్లిదండ్రులతో కలిసి ఆమె వేచి ఉండటం విశేషం.

ఆరాధ్య ఎయిర్...