భారతదేశం, నవంబర్ 2 -- Airtel OTT Plan: స్మార్ట్‌ఫోన్లలో వినోదాన్ని కోరుకునే యూజర్ల కోసం ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్‌టెల్ (Airtel) ఒక అదిరిపోయే డేటా వోచర్‌ను అందుబాటులో ఉంచింది. మీరు ఎయిర్‌టెల్ సిమ్ ఉపయోగిస్తూ, నెట్‌ఫ్లిక్స్ లేదా జియోహాట్‌స్టార్ వంటి ఓటీటీ యాప్‌లలో సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఎక్కువగా చూసేవారైతే.. ఎయిర్‌టెల్ రూ. 279 ప్లాన్ మీకోసమే.

కేవలం ఇంటర్నెట్ డేటా మాత్రమే కాకుండా, పలు ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ ఉచిత సబ్‌స్క్రిప్షన్‌లను ఒకే రీఛార్జ్‌తో అందించడం ఈ ప్లాన్ ప్రధాన ప్రత్యేకత. వీటిలో నెట్‌ఫ్లిక్స్ (Netflix Basic), జియోహాట్‌స్టార్ (JioHotstar Super), జీ5 (ZEE5 Premium), ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ప్లే (Airtel Xstream Play) ఆఫర్లు లభిస్తాయి.

అయితే ఇది సాధారణ అన్‌లిమిటెడ్ రీఛార్జ్ ప్లాన్ కాదు. కేవలం ఒక 'డేటా వోచర్' మాత్రమే. ఈ ప్లా...