భారతదేశం, మార్చి 28 -- ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ప్రభావం కేవలం సామాన్య ఉద్యోగులపైనే కాదు, ప్రపంచ ప్రఖ్యాత కంపెనీల అగ్రనేతలపై కూడా పడుతోంది! ఏఐ వేగంగా అభివృద్ధి చెందుతున్న తరుణంలో, మారుతున్న సాంకేతికతకు అనుగుణంగా సంస్థలను నడిపించేందుకు కొత్త తరం నాయకత్వం అవసరమని భావిస్తూ.. కోకాకోలా సీఈఓ జేమ్స్ క్విన్సీ, వాల్‌మార్ట్ మాజీ సీఈఓ డౌగ్ మెక్‌మిలన్ తమ పదవుల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించడం పారిశ్రామిక వర్గాల్లో చర్చనీయాంశమైంది.

కోకాకోలా సంస్థకు 2017 నుంచి సీఈఓగా ఉన్న జేమ్స్ క్విన్సీ, ఈ నెలాఖరున తన బాధ్యతలను ప్రస్తుత సీఓఓ హెన్రిక్ బ్రాన్‌కు అప్పగించనున్నారు.

"తదుపరి వృద్ధి కోసం మైదానంలోకి సరైన జట్టును దింపడం నా బాధ్యత. అందుకే ఈ మార్పు అవసరమని భావించాను," అని క్విన్సీ పేర్కొన్నారు.

తన హయాంలో కంపెనీ మంచి పురోగతి సాధించినప్పటికీ, ఇప్పుడు ఏఐ,...