భారతదేశం, ఏప్రిల్ 23 -- Adrasha kutumbam: వెంకీ మామ హీరోగా నటిస్తున్న ఫ్యామిలీ ఎంటర్ టైనర్ 'ఆదర్శ కుటుంబం' మూవీ నుంచి క్రేజీ అప్ డేట్ వినిపిస్తోంది. త్రివిక్రమ్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రం మ్యూజిక్ డైరెక్టర్ మారాడానే టాక్ హాట్ టాపిక్ గా మారింది. తమన్ ఈ సినిమాకు కొత్త మ్యూజిక్ డైెరెక్టర్ గా రంగంలోకి దిగాడని అంటున్నారు.

త్రివిక్రమ్ శ్రీనివాస్- విక్టరీ వెంకటేష్ కాంబినేషన్లో సినిమా అనగానే అంచనాలు పెరిగిపోయాయి. ఈ మూవీకి హర్షవర్ధన్ రామేశ్వర్ మ్యూజిక్ అందిస్తాడని మూవీ టీమ్ ఫస్ట్ ప్రకటించింది. అయితే ఇప్పుడు అతను ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు సమాచారం. అతని స్థానంలో తమన్ ఈ ఆదర్శ కుటుంబం మూవీకి మ్యూజిక్ అందిస్తున్నాడని తెలిసింది.

ఆదర్శ కుటుంబం లాంటి బిగ్ ప్రాజెక్ట్ నుంచి హర్షవర్ధన్ రామేశ్వర్ తప్పుకోవడం షాకింగ్ లాంటిదేనని కామెంట్లు విన...