భారతదేశం, మార్చి 7 -- టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అడివి శేష్, మృణాల్ ఠాకూర్ జంటగా నటిస్తున్న రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ 'డెకాయిట్' (Dacoit) విడుదల తేదీ మారడంపై ఇప్పుడు ఆసక్తికర చర్చ నడుస్తోంది. మొదట ఈ సినిమాను మార్చి 19న విడుదల చేయాలని మూవీ టీమ్ భావించినప్పటికీ, తాజాగా ఏప్రిల్ 10కి వాయిదా వేసినట్లు ప్రకటించారు. ఈ వాయిదా వెనుక ఉన్న అసలు కారణాన్ని అడివి శేష్ స్వయంగా వెల్లడించాడు.

బాలీవుడ్ హంగామాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అడివి శేష్ మాట్లాడుతూ.. 'ధురంధర్ 2' (Dhurandhar 2) సినిమా ప్రభావం వల్లే తాము వెనక్కి తగ్గామని నిజాయితీగా అంగీకరించాడు.

"మార్చి 19న ధురంధర్ 2 విడుదలవుతోంది. ఆ సినిమాతో పోటీ పడితే మాకు కావాల్సినన్ని థియేటర్లు దొరుకుతాయనే భరోసా లేదు. అందుకే ప్రాక్టికల్‌గా ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నాం" అని ఆయన వివరించాడు.

'ధురంధర్ 2' మీ ...