భారతదేశం, ఏప్రిల్ 1 -- Adivi Sesh: టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అడివి శేష్ వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. గూఢచారి, మేజర్, హిట్-2 వంటి వరుస థ్రిల్లర్ సినిమాలతో ప్రేక్షకులను అలరించిన అతడు.. ఇప్పుడు తన రూట్ మార్చాడు. త్వరలో 'డెకాయిట్' (Dacoit) అనే రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్‌తో బాక్సాఫీస్ వద్ద సందడి చేసేందుకు సిద్ధమయ్యాడు.

ఈ సినిమాలో 'సీతారామం' ఫేమ్ మృణాల్ ఠాకూర్ కథానాయికగా నటిస్తుండటంతో అంచనాలు భారీగా పెరిగాయి. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ షానీల్ డియో ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతుండగా, బాలీవుడ్ దిగ్గజ దర్శకుడు అనురాగ్ కశ్యప్ ఈ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తుండటం విశేషం.

ఏప్రిల్ 10న డెకాయిట్ సినిమా విడుదల కానున్న నేపథ్యంలో.. అడివి శేష్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'X' వేదికగా అభిమానులతో ముచ్చటించాడు. #AskSesh హ్యాష్‌ట్యాగ్‌తో జరిగిన ఈ చిట...