భారతదేశం, జూన్ 13 -- Adivi Sesh: టాలీవుడ్‌లో వైవిధ్యమైన సినిమాలతో తనదైన ముద్ర వేసిన హీరో అడివి శేష్ మంచి కంటెంట్ ఉన్న సినిమాలను ఎప్పుడూ సపోర్ట్ చేస్తుంటారు. తాజాగా ఆయన బాలీవుడ్ లెజెండరీ మేకర్ ఇంతియాజ్ అలీ తెరకెక్కించిన సరికొత్త సినిమా 'మై వాపస్ ఆవుంగా' చూసి ఫిదా అయిపోయారు. ఈ సినిమా ఇంతియాజ్ అలీ కెరీర్ లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ ఫిల్మ్స్ అని కొనియాడారు.

మై వాపస్ ఆవుంగా సినిమా గురించి అడివి శేష్ ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. "మై వాపస్ ఆవుంగా సినిమా ఒక మోడ్రన్ డే క్లాసిక్. డైరెక్టర్ ఇంతియాజ్ అలీ సార్ ఆలోచనలకు, ఆయన విజన్ కు ఇది ఒక పీక్ స్టేజ్ అని చెప్పొచ్చు. విభిన్న కాలాలకు సంబంధించిన రిలేషన్ షిప్స్, గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోయే సున్నితమైన క్షణాలు, అన్నింటికీ మించి.. ఈ ప్రపంచం చూపించే ఏ చిన్న ద్వేషం కంటే కూడా 'ప్రేమ' అనేది చాలా గొప్పది అని చాటిచెప...