భారతదేశం, జూలై 27 -- Adarsha Kutumbam Glimpse: విక్టరీ వెంకటేశ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'ఆదర్శ కుటుంబం హౌస్ నెం. 47' (AK47) నుంచి మేకర్స్ అదిరిపోయే స్పెషల్ గ్లింప్స్ విడుదల చేశారు. ఈ సినిమాలో 'చిట్టిబాబు' అనే సరదా క్యారెక్టర్‌లో వెంకీ మామ కనిపించబోతుండగా, ఆయన వింటేజ్ కామెడీ టైమింగ్‌తో అభిమానులను ఖుషీ చేశారు.

సోమవారం (జులై 27) ఆదర్శ కుటుంబం మూవీ గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఈ గ్లింప్స్‌లో హీరోయిన్ శ్రీనిధి శెట్టి (స్వర్ణ) ఒక మోడరన్ ఇంట్లో తిరుగుతూ కనిపిస్తుంది. ఇంటి పనులు చేయడం, వంట వండడంలో తన భర్త చిట్టిబాబు (వెంకటేష్) ఎంత పర్‌ఫెక్టో సరదాగా ఆటపట్టిస్తూ టీజ్ చేస్తుంది. ఒక ఊహించని ట్విస్ట్‌తో 'మ్యాన్ ఆఫ్ ది హౌస్'గా వెంకటేష్ క్యారెక్టర్‌ను పరిచయం చేసిన తీర...