భారతదేశం, జూలై 29 -- Adarsha Kutumbam AK47: విక్టరీ వెంకటేష్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్‌కు, మార్క్ కామెడీ టైమింగ్‌కు తెలుగు బాక్సాఫీస్ వద్ద ఉన్న క్రేజ్ వేరే లెవల్. ఇప్పుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో వెంకీ చేస్తున్న ఫ్యామిలీ ఎంటర్ టైనర్ 'ఆదర్శ కుటుంబం హౌస్ నెం: 47' (AK 47). ఇటీవల వెంకటేష్, శ్రీనిధి శెట్టి పాత్రలకు సంబంధించిన గ్లింప్స్‌లతో ఆకట్టుకున్న ఈ చిత్ర యూనిట్, తాజాగా ఈ కుటుంబంలోని మరొక విచిత్రమైన పాత్ర 'సంపూర్ణ' (యువీనా పార్థవి) క్యారెక్టర్ గ్లింప్స్‌ను విడుదల చేసింది.

తాజాగా విడుదలైన ఆదర్శ కుటుంబం గ్లింప్స్ లో చిట్టిబాబు (వెంకటేష్) కూతురు సంపూర్ణగా యువీనాను పరిచయం చేశారు మేకర్స్. వెంకటేష్, రఘుబాబు ఒక ఇంటి విషయమై సీరియస్‌గా మాట్లాడుకుంటుండగా.. 'సంపూర్ణ' ఎంతో ఉత్సాహంగా ఇంటి లోపలికి వస్తుంది. "నేను ప్రేమలో పడ్డాను నాన్న" అని అమ్మ...