భారతదేశం, జూలై 24 -- Actress Anandhi: కోలీవుడ్ స్టార్ హీరో, తమిళనాడు సీఎం దళపతి విజయ్ (Vijay) ఫేర్‌వెల్ మూవీ 'జన నాయగన్' చూశాక థియేటర్లోనే హీరోయిన్ 'కాయల్' ఆనంది కన్నీళ్లు పెట్టుకుంది. డైరెక్టర్ హెచ్. వినోద్ తెరకెక్కించిన ఈ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌లో తను నటించిన సీన్స్ అన్నింటినీ ఫైనల్ కట్‌లో పూర్తిగా ఎడిట్ చేసి తీసేయడంతో ఆమె తీవ్ర మనోవేదనకు గురైంది.

బిగ్ స్క్రీన్ మీద తను నటించిన సీన్స్ చూసుకుందామని ఎంతో ఆశగా థియేటర్‌కు వెళ్లిన ఆనందికి ఫైనల్ వర్షన్‌లో ఒక్క సీన్ కూడా కనిపించకపోవడంతో షాక్‌కు గురైంది. ఈ విషయంపై ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక ఎమోషనల్ వీడియో షేర్ చేస్తూ తన బాధను బహిరంగంగా వ్యక్తం చేసింది.

ఆనంది తన వీడియోలో మాట్లాడుతూ చాలా ఎమోషనల్ అయ్యింది. "నేను ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి దళపతి విజయ్ సర్ పక్కన ఒక్క సీన్‌లోనైనా నటించాలనేది నా పె...