భారతదేశం, ఫిబ్రవరి 28 -- సినిమా: అక్యూజ్డ్

దర్శకురాలు: అనుభూతి కశ్యప్

నటీనటులు: కొంకణా సేన్ శర్మ, ప్రతిభ రంటా తదితరులు

ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్‌

రిలీజ్ డేట్: ఫిబ్రవరి 27, 2026

ఓటీటీలో డైరెక్ట్ గా రిలీజ్ అయ్యే సినిమాలకు మంచి డిమాండ్ ఉంటుంది. అలాగే నెట్‌ఫ్లిక్స్‌ ఒరిజినల్ సినిమాగా 'అక్యూజ్డ్' డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చింది. శుక్రవారం నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. లెస్బియన్ లవ్, హోమోసెక్సువల్ (స్వలింగ సంపర్కం) ప్రధాన పాయింట్ గా తెరకెక్కిన ఈ మూవీ రిలీజ్ కు ముందే మంచి బజ్ క్రియేట్ చేసింది. మరి ఈ సినిమా అంచనాలు అందుకుందా? అనేది అక్యూజ్డ్ రివ్యూలో చూసేయండి. ఈ సినిమా సైకలాజికల్ థ్రిల్లర్ గా ఓటీటీలోకి వచ్చింది.

అక్యూజ్డ్ మూవీ మొత్తం గీతిక సేన్ (కొంకణా సేన్ శర్మ), మీరా (ప్రతిభ రాంటా) చుట్టూ తిరుగుతోంది. వీళ్లిద్దరు పెళ్లి చేసుకుంటారు. కలిసే ఉంటారు...