భారతదేశం, సెప్టెంబర్ 3 -- 2019లో పాకిస్థాన్ ఎఫ్‌-16 విమానాన్ని నేలకూల్చి, దేశవ్యాప్తంగా అపారమైన ప్రజాదరణ పొందిన వీర చక్ర గ్రహీత, భారత వాయుసేన (ఐఏఎఫ్) మాజీ గ్రూప్ కెప్టెన్ అభినందన్ వర్ధమాన్ తన జీవితంలో మరో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించారు. భారత వైమానిక దళానికి ముందస్తు పదవీ విరమణ ప్రకటించిన ఆయన, ప్రైవేట్ కమర్షియల్ పైలట్‌గా కొత్త అవతారం ఎత్తారు. ప్రాంతీయ విమానయాన సంస్థ 'ఫ్లై91' లో ఆయన పైలట్‌గా బాధ్యతలు చేపట్టినట్లు జాతీయ వార్తా సంస్థ పీటీఐ కథనం వెల్లడించింది.

విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం అభినందన్ వర్ధమాన్ ఆగస్టు నెలలోనే ఈ ప్రైవేట్ ఎయిర్‌లైన్స్‌లో చేరారు. అయితే దీనిపై అభినందన్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. మరోవైపు ఉద్యోగుల వ్యక్తిగత వివరాలను వెల్లడించలేమని 'ఫ్లై91' ప్రతినిధి ఒకరు స్పష్టం చేశారు. మార్చి 2024లో సేవలను ప్రారంభించ...