భారతదేశం, జూలై 3 -- Aamir Khan Third Marriage: బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ (Aamir Khan) తన మూడో వివాహానికి సిద్ధమయ్యాడు. గౌరీ స్ప్రాట్ (Gauri Spratt)ను పెళ్లాడబోతున్నట్లు మీడియా సమక్షంలో స్వయంగా ప్రకటించాడు. ప్రముఖ దర్శకుడు రాజ్‌కుమార్ హిరానీ రూపొందించిన సరికొత్త ఓటీటీ సిరీస్ 'ప్రీతమ్ అండ్ పెడ్రో' స్పెషల్ స్క్రీనింగ్ సందర్భంగా అమీర్ చేసిన కామెంట్లు వైరల్ గా మారాయి.

ప్రీతమ్ అండ్ పెడ్రో ఓటీటీ సిరీస్ స్క్రీనింగ్ ఈవెంట్‌లో అమీర్ ఖాన్ తన పెళ్లిపై స్పందిస్తూ.. "అవును, జూలై 5న నా వివాహం జరగబోతోంది. ఇది చాలా చిన్న వేడుక. మా ఇంట్లోనే రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోబోతున్నాం. జూలై 5 అనేది మా ఇద్దరికీ ఎంతో ప్రత్యేకమైన రోజు. కేవలం ఇరు కుటుంబ సభ్యులు, కొద్దిమంది అత్యంత సన్నిహితులు మాత్రమే దీనికి హాజరవుతారు'' అని స్పష్టం చేశాడు.

''మా కొత్త ప్రయాణానికి ...