భారతదేశం, జూలై 5 -- Aamir Khan Third Marriage: బాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో, 'మిస్టర్ పర్ఫెక్ట్' అమీర్ ఖాన్ మూడో పెళ్లి చేసుకున్నాడు. గత కొంతకాలంగా తనతో రిలేషన్‌షిప్‌లో ఉన్న గౌరీ స్ప్రాట్‌ను అతను పెళ్లాడాడు. ముంబై బాంద్రా (పాలి హిల్) లోని అమీర్ ఖాన్ స్వగృహంలో ఆదివారం (జూలై 5) నాడు ఈ వేడుక అత్యంత వైభవంగా జరిగింది.

బాలీవుడ్ సీనియర్ హీరో అమీర్ ఖాన్ మూడో పెళ్లి తంతు ముగిసింది. తన ముగ్గురు పిల్లల సమక్షంలో అమీర్ ఖాన్.. గౌరీ స్ప్రాట్ తో రిజిస్టర్ మ్యారేజీ చేసుకున్నాడు. గత రెండు సంవత్సరాలుగా డేటింగ్‌లో ఉన్న ఈ జంటకు ఒకరినొకరు 25 ఏళ్లుగా పరిచయం ఉండటం విశేషం. పెళ్లి తంతు ముగిసినట్లు అమీర్ ఖాన్ అధికారిక ప్రతినిధి మీడియాకు కన్ఫామ్ చేశాడు. వీళ్ల ఫొటో వైరల్ గా మారింది.

గడిచిన రెండు రోజులుగా ముంబై నగరంలో భారీ వర్షాలు కురుస్తున్నప్పటికీ, అమీర్ ఖాన్ ఇంట్...