భారతదేశం, ఏప్రిల్ 7 -- తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న మూవీ నుంచి క్రేజీ అప్ డేట్ వచ్చింది. ఈ మూవీ టీమ్ మంగళవారం (ఏప్రిల్ 7) ఓ పోస్టర్ తో స‌ర్‌ప్రైజ్‌ చేసింది. ఈ పోస్టర్ తో ఈ సినిమాపై హైప్ ఆశాకానికి తాకేసింది. ఇది చాలా మిస్టీరియస్ గా ఉంది.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అప్ కమింగ్ మూవీ ఏఏ22xఏ6 అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతోంది. ఈ సినిమా టైటిల్ ను బన్నీ బర్త్ డే సందర్భంగా బుధవారం (ఏప్రిల్ 8) రివీల్ చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఒక రోజు ముందు అంటే మంగళవారం రిలీజ్ చేసిన ఏఏ22xఏ6 మూవీ పోస్టర్ ఇంట్రెస్టింగ్ గా ఉంది.

అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా చేస్తున్న మూవీ నుంచి ఓ పోస్టర్ ను మేకర్స్ ఇవాళ పంచుకున్నారు. ఆ పోస్టర్‌లో ఒక క్రూర మృగం లేదా వింత జీవి పంజా (చెయ్యి) కనిపిస్తోంది.

ఆ చేతికి పొ...