భారతదేశం, సెప్టెంబర్ 21 -- ఓటీటీలో ఓ హారర్ థ్రిల్లర్ అదరగొడుతోంది. సూపర్ ట్విస్ట్ లతో థ్రిల్ పంచుతోంది. హారర్ కామెడీ థ్రిల్లర్ గా తెరకెక్కిన 'జామ్కుడి' మూవీ ఇప్పుడు మరోసారి టాక్ ఆఫ్ ది ఓటీటీగా మారింది. ఈ గుజరాతీ మూవీ గతేడాది థియేటర్లలో రిలీజైంది. బాక్సాఫీస్ దగ్గర మంచి ప్రదర్శన చేసింది. రీసెంట్ గా ఈ మూవీ హిందీలోనూ ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చింది. హిందీలోకి వచ్చినప్పటి నుంచి స్ట్రీమింగ్ లో తగ్గేదేలేదన్నట్లు దూసుకెళ్తోంది.

గుజరాతీ హారర్ కామెడీ థ్రిల్లర్ జామ్కుడి ఓటీటీలో అదరగొడుతోంది. ఈ బ్లాక్ బస్టర్ మూవీ షెమరోమీ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఇప్పుడు హిందీలోకి వచ్చిన ఈ సినిమా హాట్ టాపిక్ గా మారింది. 2024 మే 31న థియేటర్లలో రిలీజైంది ఈ జామ్కుడి మూవీ. ఆ ఏడాది అత్యధిక కలెక్షన్లు రాబట్టిన గుజరాతీ ఫిల్మ్ గా నిలిచింది. 2024, అక్టోబర్ 17న షెమరోమి ఓట...