భారతదేశం, జూలై 20 -- కైనెటిక్​ హోండా.. 90వ దశకంలో పుట్టిన వారికి ఇదొక ఎమోషన్​! ఆ కాలంలో పిల్లలు.. వారి తల్లిదండ్రుల దగ్గర ఈ స్కూటర్​ని చూసి, కాస్త పెద్దైన తర్వాత దానిని రైడ్​ చేసి ఉంటారు. కానీ అనేక కారణాల వల్ల కైనెటిక్​ హోండా డీఎక్స్​ స్కూటర్​ అనంతర కాలంలో కనుమరుగైపోయింది. అయితే, ఈ మోడల్​ ఇప్పుడు మళ్లీ భారత రోడ్లపై తిరిగే అవకాశం కనిపిస్తోంది. కైనెటిక్​ హోండా డీఎక్స్​ స్కూటర్​కి ఈవీ టచ్​ ఇస్తున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు కైనెటిక్​ గ్రూప్​ నుంచి డిజైన్​కి సంబంధించి ఇటీవలే పేటెంట్​ ఫైల్​ అయ్యింది. అండ్​ భారత రోడ్లపై ఈ మోడల్​ టెస్ట్​ డ్రైవ్​ కూడా జరుగుతోంది!

భారతదేశంలోని కైనెటిక్ ఇంజనీరింగ్, జపాన్‌కు చెందిన హోండా మోటార్ కంపెనీల సహకారంతో 1984 నుంచి 2007 వరకు కైనెటిక్ హోండా డీఎక్స్​ స్కూటర్​ ఉత్పత్తి జరిగింది. హోండా ఎన్.హెచ్. సిరీస్ స్కూటర్ల ఆ...