భారతదేశం, అక్టోబర్ 6 -- అమితాబ్ బచ్చన్.. ఇది కేవలం పేరు మాత్రమే కాదు ఓ బ్రాండ్. తన తిరుగులేని ఎనర్జీతో 82 ఏళ్ల వయసులోనూ అద్భుతమైన యాక్టింగ్ తో సాగిపోతున్నారు బిగ్ బి. అదిరిపోయే క్యారెక్టర్లు ప్లే చేస్తున్నారు. ఇప్పుడు ఇండియాలోనే రిచెస్ట్ వెటరన్ యాక్టర్ ఆయనే. కానీ ఒకప్పుడు అమితాబ్ కు రూ.90 కోట్ల అప్పు, ఆయనపై 55 కేసులు ఉండేవని మీకు తెలుసా?

బాలీవుడ్ లో రిచెస్ట్ నటుడు షారుఖ్ ఖాన్, అత్యంత ధనిక నటి జూహీ చావ్లా. ఇద్దరూ 60 ఏళ్లలోపు వారు. బాలీవుడ్ అత్యంత ధనవంతుడైన చిత్రనిర్మాత కరణ్ జోహార్ కూడా అదే వయస్సు కేటగిరీలోకి వస్తాడు. కానీ 82 ఏళ్ల వయసులో అమితాబ్ బచ్చన్ తన వయసు కెటగిరీలో అత్యంత ధనవంతుడయ్యారు. దివాలా, రూ. 90 కోట్ల రుణం, 55 కేసుల్లో న్యాయ పోరాటాల తరువాత తన కెరీర్ ను తిరిగి నిర్మించుకున్నారు.

హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2025 ప్రకారం ఈ ఏడాది అమి...