భారతదేశం, ఫిబ్రవరి 15 -- సోషల్ మీడియా విప్లవం వచ్చిన తర్వాత చాలా మంది ఇన్​స్టాగ్రామ్​ రీల్స్​ చూస్తూనో, యూట్యూబ్​ షార్ట్స్​ చూస్తూనో లేక ఫ్యాన్​ వార్స్​తో ట్విట్టర్​లో గంటలు గంటలు గడిపేస్తున్నారు. ఇలాంటి వారికి చిన్న వయస్సులోనే అల్జీమర్స్​ వచ్చే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఒక ఘటనను ప్రముఖ ఇంటిగ్రేటివ్, లైఫ్‌స్టైల్ మెడిసిన్ ప్రాక్టీషనర్ ల్యూక్ కౌటిన్హో వివరించారు. ఇది చాలా ఆందోళనకరంగా ఉంది!

"ఒక వ్యక్తి మెదడు కేవలం 9 నెలల్లోనే క్షీణించడాన్ని నేను గమనించాను.. అది వయసు రీత్యా వచ్చే అల్జైమర్స్ కాదు. మనమందరం ప్రతిరోజూ చేసే ఒక పని వల్లే అది జరిగింది," అని ల్యూక్​ పేర్కొన్నారు.

ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. శారీరక దృఢత్వంతో పాటు కెరీర్‌లో విజయవంతంగా సాగుతున్న సుమారు 50 ఏళ్ల వయసున్న వ్యక్తికి అకస్మాత్తుగా 'ఎర...