Hyderabad, Oct. 26 -- 2017లో నెపోలియన్ సినిమాతో హీరోగా, దర్శకుడిగా పరిచయమైన ఆనంద్ రవి ఆకట్టుకున్నారు. కొరమీను సినిమాలో హీరోగా చేసి అలరించారు. ఇప్పుడు మరోసారి హీరోగా, దర్శకుడిగా మెప్పించడానికి ఆనంద్ రవి తెరకెక్కించిన సినిమా నెపోలియన్ రిటర్న్స్.

నెపోలియన్ రిటర్న్స్ టైటిల్ గ్లింప్స్ లాంచ్ కామెడీ హారర్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమాలో ఆనంద్ రవితోపాటు బిగ్ బాస్ దివి వాద్యా ప్రధాన పాత్ర పోషించింది. ఆచార్య క్రియేషన్స్ బ్యానర్‌పై భోగేంద్ర గుప్త నిర్మించిన నెపోలియన్ రిటర్న్స్ టైటిల్, గ్లింప్స్‌ను ఇవాళ ఆదివారం (అక్టోబర్ 26) రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా నెపోలియన్ రిటర్న్స్ టైటిల్ గ్లింప్స్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు.

గెస్టులుగా డైరెక్టర్స్ హాజరు ఈ నెపోలియన్ రిటర్న్స్ టైటిల్ లాంచ్ ఈవెంట్‌కు డైరెక్టర్స్ వశిష్ట, సాయి రాజేష్, వంశీ నందిపాటి, అనిల్ విశ్వంత...