భారతదేశం, సెప్టెంబర్ 21 -- కోయంబత్తూరులో జరిగిన ఇడ్లీ కడై ట్రైలర్ లాంచ్ సందర్భంగా నటుడు, చిత్ర నిర్మాత ధనుష్ ఫేక్ రివ్యూస్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశాడు. సోషల్ మీడియా సమీక్షలను నమ్మవద్దని తన అభిమానులకు జాగ్రత్తలు చెప్పాడు. మూవీ మార్నింగ్ షో కాకముందే కొంతమంది రివ్యూలు పెడుతున్నారని అతనన్నాడు. తన సినిమా విషయానికి వస్తే ఇలాంటి సమీక్షలను నమ్మవద్దని ఆయన అభిమానులను కోరాడు. సోషల్ మీడియా రివ్యూలను పట్టించుకోవద్దన్నాడు.

''సినిమా ఉదయం 9 గంటలకు రిలీజ్ అవుతుంది. కానీ గంట ముందుగానే ఉదయం 8 గంటలకే కొన్ని రివ్యూలు వస్తాయి. దయచేసి అలాంటి సమీక్షలను నమ్మవద్దు. ఒక సినిమా ఉదయం 9 గంటలకు విడుదలైతే, మధ్యాహ్నం 12:30 గంటలకు మాత్రమే సినిమా ఎలా ఉందో తెలుసుకుంటారు" అని ధనుష్ పేర్కొన్నాడు.

"సినిమా ముగియకముందే చాలా సమీక్షలు వస్తాయి. దయచేసి అలాంటి సమీక్షలను నమ్మవద్దు...