భారతదేశం, ఏప్రిల్ 18 -- కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల వేచిచూపులకు తెరదించుతూ 8వ వేతన సంఘం కసరత్తు ముమ్మరమైంది. గతేడాది ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో ఏర్పాటైన ఈ కమిషన్, తాజాగా ఉద్యోగ సంఘాల నుంచి కీలక ప్రతిపాదనలను స్వీకరించింది. పెరిగిన ధరలు, జీవన ప్రమాణాలకు అనుగుణంగా జీతభత్యాల్లో భారీ మార్పులు చేయాలని సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల ప్రతినిధి సంస్థ అయిన 'నేషనల్ కౌన్సిల్ - జాయింట్ కన్సల్టేటివ్ మెషినరీ' (ఎన్​సీ- జేసీఎం) ప్రభుత్వానికి సమర్పించిన ప్రతిపాదనల్లోని ముఖ్యాంశాలు:

కనీస వేతనం : ప్రస్తుతమున్న రూ. 18,000 నుంచి రూ. 69,000కు పెంచాలి.

ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ : వేతన సవరణ కోసం 3.83 మల్టిప్లైయర్‌ను వాడాలి.

వార్షిక ఇంక్రిమెంట్: ప్రతి ఏడాది ఇచ్చే ఇంక్రిమెంట్‌ను 3% నుంచి 6%కి పెంచాలి.

హెచ్‌ఆర్‌ఏ: కనీస హెచ్‌ఆర్‌ఏ...