భారతదేశం, సెప్టెంబర్ 16 -- జ్యోతిష్య శాస్త్రంలో కేతువును అత్యంత శక్తివంతమైన, నీడ గ్రహంగా, మాయావి గ్రహంగా పరిగణిస్తారు. సాధారణంగా కేతువు ఎప్పుడూ వ్యతిరేక దిశలో ప్రయాణిస్తుంటాడు. ప్రస్తుతం ఈ మాయావి గ్రహం సూర్యుడి ఆధిపత్యం ఉన్న సింహరాశిలో కొలువుదీరాడు. పంచాగం ప్రకారం, రానున్న 81 రోజుల పాటు కేతువు ఇదే రాశిలో సంచరించనున్నాడు.

దీని వల్ల కేతువుతో పాటు సూర్య భగవానుడి ప్రభావం కూడా అన్ని రాశులపై పడనుంది. ఈ ప్రత్యేక గ్రహ స్థితి దేశవ్యాప్తంగా కొందరి జీవితాల్లో అనూహ్య మార్పులను తేనుంది. ముఖ్యంగా నాలుగు రాశుల వారికి ఈ కాలం అత్యంత లాభదాయకంగా మారనుందని స్పష్టమవుతోంది.

మేష రాశి వారికి సింహరాశిలోని కేతు సంచారం అద్భుతమైన ఫలితాలను అందించనుంది. ఈ కాలంలో మీ ఆదాయం ఊహించని రీతిలో పెరిగే అవకాశం ఉంది. వ్యాపార రంగంలో ఉన్న వారికి భారీ లాభాలు కలుగుతాయి. ఇంటి కుటుంబ...