భారతదేశం, నవంబర్ 4 -- కేంద్ర ప్రభుత్వ పింఛనుదారులు, ఉద్యోగ సంఘాలు సుదీర్ఘకాలంగా పోరాడుతున్న 'కమ్యూటెడ్ పెన్షన్ రికవరీ' (Commuted Pension Recovery) వ్యవధి తగ్గింపు అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. తమ కమ్యూటెడ్ పెన్షన్ పునరుద్ధరణ కాలాన్ని ప్రస్తుతం ఉన్న 15 ఏళ్ల నుంచి 11 లేదా 12 ఏళ్లకు తగ్గించాలని కోరుతూ పెన్షనర్ల సంఘాలు 8వ వేతన సంఘానికి అధికారిక వినతిపత్రాలను సమర్పించాయి.

15 ఏళ్ల రికవరీ నిబంధనను సమర్థిస్తూ ఇటీవల రెండు వేర్వేరు హైకోర్టులు తీర్పులు ఇచ్చినప్పటికీ.. నిపుణుల కమిటీ ద్వారా ఆక్చువేరియల్ అసెస్​మెంట్ వేసి ఈ వ్యవధిని సమీక్షించే అవకాశం ఉందని ధర్మాసనాలు సూచించాయి. ఈ నేపథ్యంలో పెన్షన్, పెన్షనర్ల సంక్షేమ శాఖ విడుదల చేసిన చిన్న సమ్మరీలో ఈ రెండు తీర్పుల వివరాలను పొందుపరచడం గమనార్హం.

మన తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో వేలాది మంది క...